| Daily భారత్
Logo




కోటగుళ్ళకు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా సహాయ సహకారాలు అందజేస్తా : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

News

Posted on 2026-02-05 14:32:01

Share: Share


కోటగుళ్ళకు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా సహాయ సహకారాలు అందజేస్తా : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

డైలీ భారత్, గణపురం: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 15 ఆదివారం నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమ గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15, 16 ,17 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి , గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, చెల్పూర్ సొసైటీ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేపాక రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటెమియా, లింగంపల్లి వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >