Posted on 2026-02-02 15:14:10
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభ్యర్థులంతా ఐక్యంగా పనిచేస్తే ఇందూర్‌లో ఘన విజయం ఖాయం అని ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ గారు స్పష్టం చేసారు. గత రెండు సంవత్సరాలుగా తాను ఎమ్మెల్యేగా ఇందూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాలంలో, నగర అభివృద్ధి కోసం సుమారు రూ.130 కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. ఇటీవలి కాలంలో టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ప్రతి డివిజన్‌కు రూ.1 కోటి చొప్పున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు.
డివిజన్ కి కోటి రూపాయల నిధులతో సమగ్ర అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించబోతున్నామన్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధుల ద్వారా రూ.23 కోట్లతో నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. రానున్న ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీదేనని ధీమా వ్యక్తం చేసారు. నగరంలో నిర్వహించిన అన్ని సర్వేలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
అర్బన్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు మద్దతుగా నిలుస్తున్నారని, అందుకే “మన ఇందూర్ మన మేయర్ ” అన్న నినాదం ప్రజల్లో నిజమై నిలుస్తోంది అని తెలిపారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇది ఇందూర్ ప్రజల మనసులోని వాస్తవ స్వరం అని పేర్కొన్నారు. మంగళవారం నుండి పూర్తిస్థాయిలో అర్బన్ ఎమ్మెల్యే ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, ద్వారా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎమ్మెల్యే అనుచరులు పేర్కొంటున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >