Posted on 2026-02-02 14:32:56
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 200 పరీక్ష కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకు సంబంధించి 31 ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు.విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో మెడికల్ పాయింట్లు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. అవసరమైన ఫర్నీచర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.పోస్టల్ శాఖ అధికారులు జవాబు పత్రాలను సక్రమంగా రిసీవ్ చేసుకునేలా చూడాలని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >