Posted on 2026-02-02 08:53:20
ఇప్పటికే ప్రకటించిన బిజెపి, ఎంఐఎం పార్టీలు
పార్టీ టికెట్ల కోసం చూస్తున్న ఆ పార్టీల కు చెందిన ఆశావాహులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి బీఫామ్ సర్టిఫికెట్లు కూడా అందజేశారు. కాంగ్రెస్, బారాస పార్టీలు ఇప్పటికీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోగా మీనమేశాలు లెక్కిస్తుంది. ఇప్పటికే సమయం కొద్దిగా ఉన్న నేపథ్యంలో నేడు రేపు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఎందుకు తమ అభ్యర్థులను ప్రకటించడం లేదో తీవ్ర చర్చనీయంశంగా మారింది. తమ అభ్యర్థులను ప్రకటించడంలో ఎందుకు అంతర్ మదన పడుతున్నారో వారికే తెలియడం లేదు. ఒక సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకె టికెట్ ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరాకండిగా చెప్పిన విషయం తెలిసిందే. అందుకే జిల్లా పార్టీ అధిష్టానం అభ్యర్థుల పేర్లను చేయడం లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు వారు కేటాయించిన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే రెబెల్స్ బెడద ఉంటుందని అందుకే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం లేదని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బిజెపి పార్టీ తమ అభ్యర్థులకు టికెట్లను కేటాయించడంతోపాటు బి ఫాం సర్టిఫికెట్లు కూడా అందజేయడంతో వారు లోలోపన ప్రచారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించి బీఫామ్ సర్టిఫికెట్లు అందివ్వకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద దెబ్బ ప్రజలను ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >