Posted on 2026-02-01 17:56:49
డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు రాష్ట్ర నాయకులు!
డైలీ భారత్, కామారెడ్డి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ , వేల కోట్ల నిధులతోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ స్పష్టంగా చాటిచెప్పింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పం ఈ బడ్జెట్‌లో కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ కాలం వృథా చేస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి అవసరమైన నిధులు, విధానాలు, అవకాశాలు అందిస్తోంది.
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ – మాటల కాదు, మెట్రోకు నిధులు
పట్టణాభివృద్ధి కోసం ప్రకటించిన ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద హైదరాబాద్‌కు కీలక అవకాశాలు కల్పించారు.
ఈ ఫండ్ ద్వారా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ట్రాఫిక్ సమస్యలపై రాజకీయాలు చేసినవారు, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.
RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ – అభివృద్ధికి అడ్డంకి ఎవరు?
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మకతకు నిదర్శనం.
ఈ ప్రాజెక్ట్ ద్వారా
– హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు సమగ్ర అభివృద్ధి
– పరిశ్రమల వికేంద్రీకరణ
– రైతులకు భూముల విలువ పెరుగుదల
– యువతకు ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, అనుమతుల పేరుతో అడ్డంకులు పెట్టడం మానుకోవాలి.
₹40 వేల కోట్ల సెమీకండక్టర్ మిషన్ 2.0 – హైదరాబాద్‌కు హైటెక్ భవిష్యత్
సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం ₹40 వేల కోట్లు కేటాయించడం ద్వారా హైదరాబాద్‌ను హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా కేంద్రం పెద్ద అడుగు వేసింది.
కేంద్రం అవకాశాలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతోంది.
బయోఫార్మా శక్తి – హైదరాబాద్ ఫార్మా రాజధానికి కేంద్ర బలం
ప్రపంచ ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు మరింత బలం చేకూర్చేందుకు "బయోఫార్మా శక్తి" పథకం కింద ₹10 వేల కోట్లు కేటాయించారు.
ఇది ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుంది.
కేంద్రం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్రెడిట్ రాజకీయాల్లో మునిగిపోతోంది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >