Posted on 2026-02-01 14:12:03
నిషేధిత గంజాయి పై అధికారులు, ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై గంజాయి అరాచక ముఠా జరిపిన దాడిలో తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడుతూ శనివారం రాత్రి తుదిత్వాస విడిచిన ఆమెకు సంతాపం తెలుపుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిషేధిత గంజాయి ఏరివేత కోసం తను నిర్వహిస్తున్న విధుల్లో భాగంగా ఆమెను తీవ్రంగా దాడి చేయడాన్ని బిజెపి పార్టీ తరఫున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గం గంజాయి రహిత జిల్లాగా ఉండేటట్లు ఎక్సైజ్ అధికారులు ఇకపై గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి ఎన్నో కలలు కన్న కానిస్టేబుల్ సౌమ్య తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడి శనివారం రాత్రి మరణించారనే వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >