| Daily భారత్
Logo




ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

News

Posted on 2026-02-01 06:45:51

Share: Share


ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ఆమె సేవలు చిరస్మరణీయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా అక్రమ గంజాయి రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన సౌమ్య  సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి దారుణ ఘటనలు ప్రజాస్వామ్య సమాజానికి మచ్చగా మిగులుతాయని అన్నారు. మృతిచెందిన సౌమ్య  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. సౌమ్య గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. అక్రమ గంజాయి రవాణా, మాదకద్రవ్యాల మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన నిందితులపై అత్యంత కఠినమైన శిక్షలు విధించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని హెచ్చరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య  ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలిపారు.

Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >