"కారు" దిగేశారు.. "చెయ్యి" కలిపేశారు
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీకి కష్టకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. శుక్రవారం అనూహ్యంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి, సుదర్శన్ తో పాటు పాలిస్టర్ యజమానుల సంఘం నుంచి పలువురు నాయకులు కారు దిగి కాంగ్రెస్లోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. చేరికల వ్యవహారం పట్టణంలో చర్చని అంశం గా మారింది.