| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈ నెల 20,21 న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఈ నెల 20,21 న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

డైలీ భారత్, మెదక్: ఈ నెల 20 ,21 వ తేదీ శని ,అది వారాలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో గురువారం ఎంపిడివో లు ,మున్సిపల్ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జనవరి 20,21 తేదీలో శని,అది వారాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం గురించి గ్రామాలలో చాటింపు వేసి ప్రచారం చేయాలన్నారు.

ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు  ఉంటుందన్నారు.

పోలింగ్ కేంద్రాలలో బి ఎల్ ఓ, లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ,గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

1 జనవరి,2024 కు 18 సం: నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి అని, సరైన గుర్తింపు కార్డ్ తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవాలన్నారు.

ఓటరు గా నమోదు చేసుకున్నవారు చిరునామా మార్పు,ఫోటో మార్పులు - చేర్పులు చేసుకోవచ్చు అని, మరణించిన వారి వివరాలు రికార్డ్ చేయాలన్నారు.

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో ఫామ్ 6,7,8 లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 

పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు దగ్గరలోని ఎమ్మార్వో , ఆర్డీఓ కార్యాలయ లో కూడా నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఓటరు గా నమోదు కావడానికి ఇదే చివరి అవకాశం కావున, జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం ను వినియోగించు కోవాలని తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం  అదనపు కలెక్టర్ రమేష్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఎంపిడిఓ లు,మున్సిపల్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Previous అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు
Next హరిత హారం లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ADVERTISEMENT