| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి: కుటుంబ సభ్యుల ఘన నివాళి

నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి: కుటుంబ సభ్యుల ఘన నివాళి

డైలీ భారత్, హైదరాబాద్: ఇవాళ ఎన్టీఆర్‌ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానాయకుడిని స్మరించుకుంటున్నారు.

అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వళ్లి నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్‌కి వెళ్లారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‎కు నివాళులు అర్పించారు.

రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని బాలకృష్ణ అన్నారు.

బాలయ్యతోపాటు సుహాసిని, రామకృష్ణ కూడా ఎన్టీఆర్‎కి నివాళులు అర్పించారు. అటు.. బాలయ్య కంటే ముందే తెల్లవారుజామున జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌.. నందమూరి తారకరామారావు ఘాట్‌కి వెళ్లారు.

తాతయ్య సమాధిపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.వీరి రాక సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకు న్నారు.

Previous తమ్మినేని ని పరామర్శించిన మంత్రులు బట్టి, పొంగులేటి
Next విద్యార్థుల జీవితాలతో చలగటం ఆడుతున్న ఆటో వాహనదారుల పై చరియలు తీస్కోవాలి : TGVP
ADVERTISEMENT