దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ ను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
డైలీ భారత్, చేగుంట: ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో మల్లన్న సాగర్ కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని కోరుతూ.. మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త మ్ కుమార్ ను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా సుమారు ఒక లక్ష 30 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో... నిర్మించిన కాలువల ప్రణాళికను మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో దుబ్బాక చేగుంట తదితర పలుచోట్ల నిలిచిపోయిన ఉప కాల్వల నిర్మాణాలు కొనసాగడం లేదని మంత్రికి విన్నవించారు. ఇందుకు సంబంధించిన విషయంపై ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంపై గత వారం రోజుల కిందట కలెక్టరేట్లో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించిన అంశాలను, పలుచోట్ల ల్యాండ్ ఇష్యూ సంబంధించిన అంశాల ను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు త్వరలోనే మల్లన్న ప్రాజెక్టు ఉపకాల్వల నిర్మాణ పనులను కొనసాగించేందుకు అధికారులకు ఆదేశాలు జారి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.