| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళ సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక

మహిళ సమైక్య నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షురాలిగా కవిత, ఉపాధ్యక్షురాలిగా రూపా

మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి

మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి.

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో పట్టణ సమైక్య నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమాఖ్యల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నికల్లో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో కవితను అధ్యక్షురాలిగా, రూపాను ఉపాధ్యక్షురాలిగా, మంజులను కార్యదర్శిగా, పద్మను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, టీఎంసీ రవిశంకర్, సీఓ అనసూయతో పాటు వివిధ సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాలు తప్పనిసరిగా పంచసూత్రాలను పాటించాలని సూచించారు. రుణాలు తీసుకున్న మహిళలు వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. అలాగే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలందరూ సంఘటితంగా పనిచేస్తే కుటుంబాలే కాక సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.

నూతన కార్యవర్గం మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.

Previous కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
Next సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టి అతడి వస్తువులను దోచుకున్న ఆటో డ్రైవర్
ADVERTISEMENT