| Daily భారత్
Logo




అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన అర్బన్ ఎమ్మెల్యే నివాసం

News

Posted on 2026-01-08 19:44:56

Share: Share


అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన అర్బన్ ఎమ్మెల్యే నివాసం

అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప గురు స్వామి బల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ

 డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్ లోని కిసాన్ వేర్ హౌస్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులతో సహా వారి కుటుంబ సభ్యులు, ఆయన తనయుడు ధన్ పాల్  ప్రణయ్ స్వామి నిర్వహించిన పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్యే స్వస్థలం కిసాన్ వేర్ హౌస్ వేదికగా అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.  అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో "పడిపూజ మహోత్సవాన్ని"  

బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. పడిపూజ కోసం  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు చెందిన కిసాన్ వేర్ హౌస్ లో వారి తనయుడు ధన్ పాల్ ప్రణయ్ కుమార్  ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి పూలతో వైభవంగా అలంకరించారు.  వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య  స్వామి మరియు అయ్యప్ప స్వామి ప్రాణప్రతిష్ట, పడిపూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ సతీమణి  ధన్ పాల్ మణిమాలతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పడిపూజ మహోత్సవ వేడుకలను తిలకించడానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పడిపూజ సందర్భంగా  అయ్యప్ప స్వాములకు, భక్తుల కోసం అర్బన్ ఎమ్మెల్యే  ప్రత్యేకంగా బిక్షను ఏర్పాటు చేశారు.

బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడే నాయకులు దొరకడం మన అదృష్టమన్నారు. భక్తుల కోసం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కి, హృదయపూర్వక ధన్యవాదలు తెలిపారు. ఆయన బాటలో వారి తనయులు ఆధ్యాత్మిక బాటలో నడవడం గొప్ప విషయం అని ఆయన తనయుడు ధన్ పాల్ ప్రణయ్ స్వామి అయ్యప్ప మాలధారణ వేసి ఇంత గొప్పగా ఓ పండగ వాతావరణం లో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పడి పూజ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ హైందవ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువ అపారమని ముఖ్యంగా సంస్కారం, సేవ, పరస్పర గౌరవం, ప్రేమ ఇవన్నీ మన కుటుంబాన్ని నిలబెట్టే వేర్లలాంటివన్నారు. ఈ విలువలన్నింటినీ కాపాడుతూ మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా నడుస్తుంది. ప్రపంచం మారినా, యుగాలు మారినా, మన కుటుంబ వ్యవస్థ మాత్రం ధర్మాధారంగా వెలుగుతూ వస్తోందన్నారు. అయ్యప్ప స్వామి భక్తి కూడా అంతే పవిత్రం అని అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు 41 రోజుల దీక్షలోకి ప్రవేశిస్తారన్నారు. ఈ మాలధారణ అంటే కేవలం ఆచారం కాదని, ఇది మనస్సును శుద్ధి చేసే సాధన, శరీరాన్ని నియంత్రించే నియమం అని అన్నారు. ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే మార్గం అని అన్నారు. ఈ 41 రోజులు భక్తులు పాటించే అహింస, సత్యం, సాధన ఇవన్నీ మన సనాతన ధర్మం నేర్పిన విలువలే అని, ఒకరి పై మరొకరికి గౌరవం, సమానత్వం, అన్నదమ్ముల బంధం ఇవే అయ్యప్ప స్వామి భక్తి  అని తెలిపారు.

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజం లో ఐక్యత,కుటుంబాల్లో ఆనందం, ప్రతి ఇంట్లో  సంపూర్ణ ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించాలని స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >