| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సుద్దాల రైస్ మిల్ ను సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు

సుద్దాల రైస్ మిల్ ను సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ను పొల్యూషన్ కంట్రోల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు.

రైస్ మిల్ నుంచి వెలువడు తున్న వ్యర్థపదార్థాలు తమ పొలాల్లోకి వస్తున్నాయని రైస్ మిల్ యాజమాన్యానికి రైతులు పలుమార్లు తెలిసి నప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో రైతులు నెల రోజుల కిందట రామగుండం, హైదరాబాద్‌లోని పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంట పొలాలను పరిశీలించారు.అనంతరం సాయి వెంకటే శ్వర రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు.

Previous రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ రాజర్షిషా
Next నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ADVERTISEMENT