రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల నీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని విడియో సమావేశ మందిరంలో బుదవారం "రోడ్డు సేఫ్టీ కమిటీ " అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని , రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
హెల్మెట్ పై ప్రజల్లో మరింత అవగహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బోర్డ్ లు,సూచికలు, సైన్ బోర్డ్ లు,రేడియం బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు.
మూలమలుపుల దగ్గర హెచ్చరికల బోర్డ్ లు , స్పీడ్ లిమిట్ బోర్డ్ లు ,ఏర్పాటు చేసి , రోడ్డు గుంతలను పూడ్చి వేయాలన్నారు .
స్పీడ్ బ్రేక్ లు ఏర్పాటు చేసి, మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని,రోడ్డు మరమ్మత్తులలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.
రోడ్డు భద్రత గురించి ప్రతి ఒక పౌరుడు తెలుసు కోవాలని, రోడ్డు భద్రత పై బాధ్యత కల్గి ఉండాలన్నారు.
దేశం లో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందన్నారు.
ప్రతి 3 నిం: లకు రోడ్డు ప్రమాదాల వల్ల ఒకరు చనిపోతున్నారని తెలిపారు. కొద్ది పాటి నిర్లక్ష్యం ఫలితంగా కుటుంబాలు రోడ్డు పాలవుతాయనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. ఎక్కువ శాతం అధిక వేగం తో రోడ్డు పై వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందన్నారు.
రోడ్డు పై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రతగా వాహనాలు నడపాలని సూచించారు.
రోడ్డు నిబంధన లను, సూచనలను పాటిస్తూ వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, అదనపు ఎస్పీ మహేందర్ ,ఆర్టీసీ డీఎం సుధ , డి ఎం & హెచ్ ఓ చందు నాయక్, ఎక్సయిజ్ అధికారి రజాక్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.