| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

డైలీ భారత్, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు..

ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శివాజీనగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, శంకుస్థాపన చేశారు.

తర్వాత NG కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేశారు.

అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్దిదారులకి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. . ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తా మని ఆయన పేర్కొన్నారు.

యుపిఎస్ సి తరహాలో గ్రూప్స్ పరీక్షలని నిర్వహిస్తా మని, నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు.

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. సంక్షేమ పథకాల కోసం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదా రులకు అందిస్తామని ఆయన వెల్లడించారు.

కల్యాణలక్ష్మి, షాదీము బారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు...

Previous సుద్దాల రైస్ మిల్ ను సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు
Next కూలీలతో కలిసి వరి నాటు వేసిన కలెక్టర్
ADVERTISEMENT