| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

190 జిఓ ను తక్షణమే అమలు పరచాలి : PRTU

190 జిఓ ను తక్షణమే అమలు పరచాలి : PRTU

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి హరేందర్ రెడ్డి

డైలీ భారత్, సిరిసిల్ల: 317 జీఓ కారణంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి స్వంత గ్రామాలు,స్వంత జిల్లాలను వదిలి,దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.ఆర్థిక భారం,మానసిక ఒత్తిడి,పిల్లల భాద్యతలు,వృద్ధ తల్లిదండ్రుల రక్షణ,వంటి అనేక సమస్యలతో సతమవుతూ పనిచేస్తున్నారు. నేటితో 317 జీఓ అమలు అయి 4 సంవత్సరాలయింది 4 ఏళ్లుగా విజ్ఞప్తులు, నిరసనలు,వినతులు,ధర్నాలు ఎన్ని చేసిన ఉపశమన చర్యలు ఆశించినంత మేరలో రాలేదు.దీని కోసం ఏర్పాటు చేసిన కాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు వెలువడిన 190 జీఓ వచ్చి 4 నెలలు అయింది.అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని 4నెలలు అయింది కాబట్టి వెంటనే 190 జీఓ ను అమలు పరచి ఉద్యోగ ఉపాధ్యాయులకి తాత్కాలిక డెప్యూటేషన్ లు కలిపించాలని కోరారు..అవసరం అయితే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి న్యాయం చేయాలన్నారు.సమావేశంలో ప్రధాన కార్యదర్శి k హరేందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు p సత్యనారాయణ, శిరోమణి,సరోజ,s రమేష్, వెంకటరమణ పాల్గొన్నారు...

Previous విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
Next ఏసీబీకి చిక్కిన ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌
ADVERTISEMENT