డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నూతన సంవత్సర వేడుకల పురస్కరించుకొని గురువారం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జిల్లాలోని చిన్న పిల్లల అనాథాశ్రమాలను సందర్శించి , అక్కడి పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై, వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గర్ల్స్ ( బాల సధన్ ), శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్ , హియరింగ్ ఎంపెయిర్ అనాధశ్రమాలు పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వారెడ్డి, టౌన్ 4 ఎస్. హెచ్. ఓ సతీష్ కుమార్, టౌన్ 3 ఎస్. ఐ హరిబాబు, అనాధ ఆశ్రమాల సూపర్డెంట్లు వినోద , శోభారాణి , అనిత తదితరులు పాల్గొన్నారు.
News
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనాథాశ్రమాల్లో పిల్లలకు నోట్ బుక్స్ , పెన్నులు , పండ్లు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్