వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలోని విశ్రాంత అధికారుల వివరాలపై ఆరా
విధుల్లోని విశ్రాంత అధికారుల వివరాలివ్వాలని వివిధ శాఖలకు సీఎస్ ఆదేశం
బుధవారం సాయంత్రం 5 వరకు వివరాలివ్వాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశం
డైలీ భారత్, హైదరాబాద్: వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే రిటైరైనప్పటికీ.. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న అధికారుల వివరాలు బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్కియాలజీ, MCHRD, ఎండోమెంట్ ఇలా పలు శాఖల్లో విశ్రాంత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని తొలగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అని చర్చ మొదలైంది.