| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న నల్లగొండ గద్దర్

శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న నల్లగొండ గద్దర్

శివరాత్రికి రాజన్నపై కొత్త భక్తి గీతం విడుదల చేస్తానని ప్రకటన.

డైలీ భారత్, వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయకుడు కాసాల నర్సిరెడ్డి అలియాస్ నల్లగొండ గద్దర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని గద్దర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ గద్దర్ మాట్లాడుతూ, శ్రీ రాజరాజేశ్వర స్వామిపై తాను పాడిన భక్తి కీర్తనలను గుర్తు చేసుకున్నారు. అలాగే రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నపై కొత్త భక్తి గీతాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు.

Previous గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు : జిల్లా ఎస్పీ డాక్టర్.వినీత్ IPS
Next అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
ADVERTISEMENT