Posted on 2025-12-27 03:47:50
జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులు సుమారు 50 లక్షల నగుదును కాల్చి బూడిద చేసిన వైనం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార దుకాణాలు, ఇక మొన్నటికి మొన్న జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శంభుని ఆలయంలోకి ప్రవేశించి అందులో ఉన్న సామాగ్రిని దొంగలించిన ఘటన తెలిసిందే.. ఇక ఏటీఎంల లో ఉన్న డబ్బులు దొంగిలించడానికి దొంగలు చేయని ప్రయత్నాలు లేవు. నిత్యం ఎక్కడో చోట ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న ఘటనలు అనేకం. ముఖ్యంగా చైన్ స్నాచింగ్స్ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం రేపుతున్న నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ ఘటన అందరినీ విస్మయపరుస్తుంది. కేవలం ఒకేరోజు రెండు ఏటీఎంలలో చోరీకి యంత్రించిన దుండగులు.. యంత్రాలు తెరుచోకపోవడంతో వాటిని తగలబెట్టారు. దీంతో రెండింట్లోని సుమారు రూ. 50 లక్షలకు పైగా నగదు చిత్తు కాగితాలగా కాలి బూడిదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన దొంగలు ఎస్బిఐ బ్యాంక్ కు చెందిన ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు కాజేయాలని ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో దానిని తగలబెట్టారు. దీంతో ఏటీఎంలోని సుమారు రూ. 27 లక్షల నగదు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఇక్కడి ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో దానిని కూడా దుండగులు తగలబెట్టారు. ఇందులో ఉన్న దాదాపు రూ. 25 లక్షల నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో, ఒకేరోజు రెండు ఏటీఎంల చోరీ ఘటనలు జరగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. సంఘటన స్థలాలను డీసీపీ బసవ రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బైక్పై, కారులో రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >