| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రామ పంచాయతీ ల అబివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

గ్రామ పంచాయతీ ల అబివృద్దికి ప్రణాళికలు తయారు చేయాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని G.P.D.P సమావేశం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లా అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం జిల్లా  పంచాయతి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు రాజర్షి షా మాట్లాడుతూ  దేశానికి గ్రామాలే పట్టు కొమ్మలని , గ్రామాన్ని  అభివృద్ది చేసుకుంటే ,

దేశాన్ని అభివృద్ధి చేసుకున్నట్లు అని అన్నారు.

గ్రామ పంచాయతీ అభివృద్ది  ద్వారా  ప్రజలలో జీవన విధానం లో మార్పులు వస్తాయన్నారు. జనవరి 31 లోపు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ లు తయారు చేసుకోవాలనీ,

 G.P.D.P ప్లాన్ లు చేసి e గ్రామ్ స్వరాజ్  యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు.

జిల్లా ,మండల ప్లాన్ లు ఫిబ్రవరి నెల లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్,డి ఆర్ డి ఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శైలేష్,డి పి ఓ సాయి బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Previous కెనరా బ్యాంక్ మేనేజర్ స్థానిక విలేకరులకు క్యాలెండర్లు అందజేశారు
Next రామలింగేశ్వర స్వామి జాతరకి హాజరై పూజలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
ADVERTISEMENT