Posted on 2025-12-25 18:36:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్లో గురువారం సీనియర్ కౌన్సిలర్ రఫత్ ఖాన్ రాయల్ మోటార్స్ ద్విచక్ర వాహనాల షోరూమ్ ని లాంచలంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ జిల్లా చైర్మన్ ఇర్ఫాన్ అలీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జావిద్ అక్రమ్, మైనారిటీ వైస్ చైర్మన్ ముజాహిద్ ఖాన్, 59 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సర్ఫ రాజ్ ఖాన్, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల్ మోటార్స్ యజమాని అర్షద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మంచి ఇంజన్ కండిషన్ల తో కూడిన సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను విక్రయించడమే తమ ప్రధాన ఉద్దేశం అని, సెకండ్ హ్యాండ్ వాహనాలు అని ఎలాంటి మోసానికి తావివ్వకుండా తమ దగ్గరికి మంచి కండిషన్లతో కూడిన వాహనాలనే తీసుకుంటామని ఆయన అన్నారు. నమ్మకమే ధ్యేయంగా ప్రజలకు మంచి వాహనాలను అందివ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. తమ వద్ద అన్ని రకాల కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా రాయల్ ఇన్ఫీల్డ్, హీరో, బజాజ్, హోండా, టీవీఎస్, యాక్టివా, టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. తమ దగ్గర ప్రారంభ ధర 30 వేల ధర నుండి వాహనాల విక్రయం ఉంటుందని, కావలసిన ద్విచక్ర వాహన ప్రియులు వారివారికి కావాల్సిన వాహనాలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >