| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏలూరు జిల్లాలో భోగి పండుగ పూట విషాదం

ఏలూరు జిల్లాలో భోగి పండుగ పూట విషాదం

డైలీ భారత్, ఏలూరు జిల్లా: ఏపీలో భోగీ పండుగ పూట ఆదివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామంలో ముగ్గు వేస్తున్న ఇద్దరు అక్క, చెల్లెలిని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పో యింది.మరో యువతి పల్లవిదుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో లారీ డ్రైవర్ పరిపోగా.. మరో వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. గాయ పడిన పల్లవిదుర్గను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టుకున్న వ్యక్తిని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు.

Previous బోగీ సంబ‌రాల‌లో జ‌గ‌న్ దంప‌తులు
Next భోగి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ADVERTISEMENT