Posted on 2025-12-15 08:49:48
డైలీ భారత్ న్యూస్, హుజూర్నగర్: ప్రజాస్వామ్యం ప్రజల చేతిలోనే ఉంటుంది. ఆ శక్తి ఓటు రూపంలో మనకు లభించింది. ఒక్క ఓటు విలువ లేదని అనుకోవడమే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద నష్టం. అనేక ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే విజయం లేదా ఓటమి నిర్ణయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం వేసే ఓటే నాయకులను నిర్ణయిస్తుంది, పాలన దిశను మార్చుతుంది. ఓటు హక్కు మనకు ఉచితంగా రాలేదు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా అది మనకు దక్కింది. అందుకే ఓటు వేయకపోవడం అంటే ఆ త్యాగాలను నిర్లక్ష్యం చేసినట్లే. నా ఒక్కరితో ఏమవుతుందిలే అనుకోవద్దు. ప్రతి ఒక్కరి ఓటు కలిసినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది.
కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, మన కర్తవ్యమూ. నేడు వేసే ఒక్క ఓటే రేపటి మంచి భవిష్యత్తుకు పునాది.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >