| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు.

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెట్రోలింగ్ వాహనాలు,ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Previous అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు
Next మరో గంటలో ముగియనున్న గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్
ADVERTISEMENT