| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు

అంబులెన్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న ఇద్దరు రోగులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అలాంటి ఐదు ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి  బోధన్ డివిజన్ కు చెందిన సాలూరు మండలంలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. జాడి జమాల్పూర్ గ్రామంలో ఇద్దరు పేషెంట్లు అంబులెన్స్లో వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి ఓటును వేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ఉండి కూడా నేటితరం యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడని వారికి ఈ పేషెంట్లు వారికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Previous బోధన్ డివిజన్లో ప్రారంభమైన గ్రామ పంచాయతీ పోలింగ్
Next ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
ADVERTISEMENT