| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్నికల నామినేషన్ వేస్తున్న తల్లి.. ఏడుస్తున్న చిన్నారినీ లాలించిన ఎస్సై గడ్డం ఉమా

ఎన్నికల నామినేషన్ వేస్తున్న తల్లి.. ఏడుస్తున్న చిన్నారినీ లాలించిన ఎస్సై గడ్డం ఉమా

డైలీ భారత్ న్యూస్, డోర్నకల్: మండలం లో నీ గొల్లచెర్ల గ్రామ నామినేషన్ కేంద్రంకు  హాజరయ్యేందుకు  హూన్యతండా గ్రామానికి చెందిన భూక్యా మంజులరాంబాబు నాయక్ 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయడానికి మహిళ తన 6 నెలల బాబుతో వచ్చింది. మూడో విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలో భాగంగా నామినేషన్ కేంద్రం వద్ద గురువారం వివిధ పార్టీల నుండి సర్పంచ్, వార్డులుగా పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా రావడంతో సమయం ఎక్కువ అయ్యే అవకాశం ఉండడంతో  అయినప్పటికీ ఆ తల్లికి తన చిన్నారిని ఎన్నికల నామినేషన్ కేంద్రంకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న డ్యూటీ నిర్వహిస్తున్న ఎస్సై గడ్డం ఉమా ఆమెకు మద్దతుగా నిలిచారు.నామినేషన్ దాఖలు చేస్తున్న  మహిళ బిడ్డను చూసుకుంటున్న మహిళా ఎస్సై పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Previous సర్పంచ్ ఎన్నికలవేళ ఆగని వీడిసి ఆగడాలు
Next మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
ADVERTISEMENT