దోన్కల్ గ్రామ సర్పంచ్ గ్రామ స్థానం ఏకగ్రీవంపై కలెక్టర్ కు ఫిర్యాదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికలవేళ గ్రామపంచాయతీల్లో వీడిసి కమిటీ సభ్యుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. తమకు నచ్చిన వారిని సర్పంచిగా విడిసి తీర్మానం చేపట్టడంతో ఎన్నికల నియామవారికి నిబద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ మోర్తాడ్ మండలం దోన్కల్ సర్పంచి పదవిని రూ.32 లక్షలకు ఓసీ వర్గం వారు వేలం వేసి దక్కించుకున్నారని ఎస్సీ వర్గానికి చెందిన సర్పంచి అభ్యర్థి శుక్రవారం కలెక్టర్ కు ఫిర్యా దు చేశారు. అధికారులని పంపి నివేదిక తెప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రోజురోజుకు వీడీసీ ఆగడలు మితి మీరిపోతున్నాయని బాధితులు ఆరోపించారు. నామినేషన్ వేయకుండా చేశారని ఎస్పీ సర్పంచి అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.