డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్:రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన శిక్షలు విధిస్తారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లే యాత్రికులు రైలులో పూజ సందర్భంగా కర్పూరం
వెలిగించకూడదని సూచిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ఇది నేరమని వివరించారు. రైళ్లలో కర్పూరం వెలిగిస్తే రూ. వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.అలా చేయటం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 67,154, 164,165 ప్రకారం శిక్షార్హులు. శబరిమల రైళ్లలో భక్తులు కర్పూరం వెలిగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో కర్పూరాన్ని వెలిగించడం నిషేధం అన్నారు. రైలులో అగ్గిపుల్ల వెలిగించినా నేరమేనని చెప్పారు. ఇలాంటి చర్యలపై ప్రయాణికులు టోల్ ఫ్రీ నంబరు 182 కు ఫోన్ చేసి, సమాచారం అందించాలని తెలిపారు.