డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరానికి చెందిన దివ్య, ప్రజ్ఞ అనే ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ తొలిసారిగా అయ్యప్పస్వామి మండల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయంలో రమేష్ పంతులు వీరికి మాల వేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన దివ్య, ప్రజ్ఞలు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం దీక్ష చేపట్టామన్నారు. ఇక్కడ అందరూ తమను ఎలాంటి వివక్ష లేకుండా ఆదరిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో తమ ట్రాన్స్ జెండర్లు 15 ఏళ్ల క్రితమే దీక్ష చేపట్టారన్నారు.
News
ఇందూరు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు