Posted on 2025-11-24 11:31:10
జిల్లాలోని చందూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం
పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్.. పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ చదువు ఒత్తిడి నే కారణమా.. లేదా ఇతర ఏదైనా కారణాలు ఉండవచన్న అనుమానాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏది ఏమైనా చిన్న వయసులోని అది ఓ ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడం పట్ల విద్యార్థి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని ఎస్సై సాయన్న వివరించారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >