| Daily భారత్
Logo




మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

News

Posted on 2025-11-23 16:32:35

Share: Share


మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటిచ, పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు  అన్నారు. ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు,మండలి చీఫ్ విప్  పట్నం మహేందర్ రెడ్డి ,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిధులుగా పాల్గొని  చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా "మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి"ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, జిల్లాలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగాలని మహిళలు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లో భాగస్వామ్యం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు  మల్ రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహా రెడ్డి, కోదండరెడ్డి,అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీడీ శ్రీలత, షాబాద్ మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ ,జిల్లాకు సంబందించిన ఐకేపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >