Posted on 2025-11-22 10:56:25
డైలీ భారత్, న్యూస్ తిరుమల:ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరూ రీల్స్ చేయొద్దనే నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి. కానీ, కొందరు అజ్ఞానులు నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు. వారు సాధారణ ప్రజలైతే తెలీక చేశారని అనుకోవచ్చు.. కానీ, తాజాగా ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల క్యూ లైన్‌లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేసింది. తాను చేసింది మంచి పని అన్నట్లుగా వీడియో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడగా.. భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే, ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు ‘తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం’.. ‘రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >