| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : (DTF)

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : (DTF)

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ.

డైలీ భారత్, సిరిసిల్ల : ఇటీవల షెడ్యూల్ విడుదలై,  ఆగిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులు,  బదిలీల ప్రక్రియను తిరిగి చేపట్టి, వెంటనే పూర్తి చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు దొంతుల శ్రీహరి కోరారు. 11.01.2024 గురువారము సాయంత్రం 5.00 గంటలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ప్రాంగణంలో నూతన సంవత్సరం-2024 DTF క్యాలెండర్ ను DTF రాష్ట్ర, జిల్లా, వివిధ మండలాల బాధ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వము ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక విద్యారంగం పూర్తిగా నిరాదరణకు గురైందని, ఉన్నత  పాఠశాలల్లో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల స్థానంలో పదోన్నతులతో భర్తీ చేయకపోవడం వలన సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, అలాగే గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ బదిలీలు, చేపట్టక పోవడం వల్ల, ఉపాధ్యాయ నియామకాలు లేక అన్ని రకాల పాఠశాలల్లో వివిధ ఖాళీలు భర్తీ కాకపోవడం వల్ల  విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగిందని, కొత్తగా ఏర్పడిన  నూతన ప్రభుత్వం అయినా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల దృష్టి సారించి పదోన్నతులు, బదిలీలు, నియామకాలు వెంటనే చేపట్టాలని, రానున్న వేసవిలో పూర్తి చేయాలని,  అలాగే ఇటీవల బదిలీ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి,  వారి స్థానాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని కోరారు.

 DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి అవ్వురం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో  పెట్టిన విధంగా విద్యారంగానికి బడ్జెట్ లో 15% నిధులు కేటాయించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, విద్యా శాఖలో ఏర్పడిన అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పూర్వ అధ్యక్షులు,  ప్రస్తుత రాష్ట్ర కౌన్సిలర్ ఆయిల్నేని రాజేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 317 జీవోను తీసుకువచ్చి వందలాదిమంది ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేసిందని, ఏ స్థానికత కోసమైతే పోరాడి, తెలంగాణ రాష్ట్రము సాధించుకొన్నామో,   ఆ స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాలకు బదిలీ కాబడి, భార్యాభర్తలు వేరువేరు ప్రాంతాల్లో పనిచేస్తూ, అనేక ఇబ్బందులకు గురవుతూ,  కుటుంబాలకు దూరమై అనేక కష్టనష్టాల గురవుతున్న ఉపాధ్యాయులకు నూతన ప్రభుత్వం 317 జీఓ సవరించి వారి సొంత జిల్లాలకు పంపించి న్యాయం చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని రకాల ఆర్థిక బిల్లులకు ఆమోదం తెలిపి, వెంటనే చెల్లింపులు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు దొంతుల శ్రీహరి,  ప్రధాన కార్యదర్శి అవ్వురం సుధాకర్ రెడ్డి,  రాష్ట్ర కౌన్సిలర్లు ఆయిల్నేని రాజేశ్వరరావు, E.సత్యనారాయణ, జిల్లా బాధ్యులు ఎం. విష్ణు ప్రసాద్,  T.సురేష్, K.రాజేశం,  సిహెచ్. రవీందర్,  వివిధ మండలాల బాధ్యులు B.సంపత్, రమేష్,  S. అశోక్, P. అనిల్, D.విష్ణు ప్రసాద్ రావు, J.శ్రీనివాస్,  G.రాజేందర్, సీనియర్ సభ్యులు B.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Previous వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..
Next సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం
ADVERTISEMENT