| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..

వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..

డైలీ భారత్, చిట్కుల్: ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

వడ్డే ఓబన్న  217 వ జయంతిని పురస్కరించుకొని  చిట్కుల్ గ్రామంలోని నీలం మధు తన కార్యాలయంలో  వడ్డేఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వలేపు వెంకటేశ్, మంజలి శ్రీనివాస్, ఈశ్వర్,రాజు,నగేష్, రాము రాయుడు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Previous యువకుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క
Next ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు, నియామకాల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : (DTF)
ADVERTISEMENT