| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షార్ట్ సర్క్యూట్ తో గృహ నివాసం దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో గృహ నివాసం దగ్ధం

మోపాల్ మండలం లో దారుణం..షార్ట్ సర్క్యూట్ తో గృహ నివాసం దగ్ధం..

భారీగా ఆస్తి నష్టం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో జంగం గణేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయని మోపాల్ ఏఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఏసీ, ఫర్నీచర్, దుస్తులు వంటి విలువైన వస్తువులు కాలిపోయాయి. సుమారు 2.56 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Previous స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో క్లీనర్ మృతి
Next తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్
ADVERTISEMENT