డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ కు చెందిన స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది . నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సు అర్సపల్లి ప్రాంతంలో విద్యార్థులను స్కూలుకు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు వెనక్కి తీసే క్రమంలో క్లీనర్ జక్కుల కిషన్ వెంకటయ్య ప్రమాదవశాత్తు బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అంతలా అజాగ్రత్తగా నడిపిఅంతలా అజాగ్రత్తగా నడపే డ్రైవర్ను జిల్లాలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థ యాజమాన్యం ఏ అర్హతతో సదరు డ్రైవర్ను నియమించుకున్నారో ఆ పాఠశాల యాజమాన్యానికే తెలియాలి. అంతలా అజాగ్రత్తగా నడపే ఆ డ్రైవర్ ఒకవేళ అందులో బస్సులో పాఠశాల చెందిన విద్యార్థులు ఉంటే ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామానికి చెందిన జక్కుల కిషన్ రెండు రోజుల క్రితమే స్కూల్ బస్సు క్లీనర్ గా చేరాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News
స్కూల్ బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో క్లీనర్ మృతి