డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపినవివరాలు ప్రకారం ముగ్గురు వ్యక్తులు నిషేధిత గంజాయిని కొత్తగూడెంలో కొనుగోలు చేసి వేపలగడ్డ శివారులో తాటిపల్లి ఇష్టా హోమ్స్ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద గంజాయిని తాగడానికి వస్తారని పక్కా సమాచారం మేరకు ఆ వ్యక్తులు రాక ఎస్సై రమాదేవి తన సిబ్బందితో కలిసి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వెళ్లేసరికి ముగ్గురు వ్యక్తులు పోలీస్ సిబ్బంది ని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి మోటార్ సైకిల్ వదిలి పారిపోగా ఒక వ్యక్తి పోలీస్ వారికి పట్టుబడినాడు వ్యక్తిని విచారించగా అతని పేరు జినుగు చేతన్@ మింటు,తండ్రి:సాల్మన్ రాజు, సన్యాసి బస్తి కొత్తగూడెం అని చెప్పి ఇట్టి వ్యక్తి మరియు పారిపోయిన సిర్ల సాయికిరణ్, మంచినీళ్ల పూజిత్ తో కలిసి కొత్తగూడెంలో గుగులోత్ నరేష్ @కోడి R/o టేకులబంజర అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి ఈ ముగ్గురు కలిసి పల్సర్ మోటార్ సైకిల్ పై ఈరోజు మధ్యాహ్నం సమయంలో వేపల గడ్డ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందకు వచ్చి గంజాయినికి తాగడానికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అట్టి వ్యక్తి వద్ద నుంచి Rs. 9,340/ విలువ గల 186.8 గ్రాముల గంజాయిని, ఒక మొబైల్ ఫోన్, పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు. పరారీలో ఉన్న నిందితులు నిందితుల గుగులోత్ నరేష్ ,సిర్ల సాయి కిరణ్, మంచినీళ్ల పూజిత్ గంజాయి కొనడం అమ్మడం సేవించడం రవాణా చేయడం కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. గంజాయి సమాచారం తెలిసిన యెడల పోలీస్ వారికి తెలియజేయగలరు. వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. సుజాతనగర్ ఎస్ఐ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
నిషేధిత గంజాయిని సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసిన సుజాతనగ్ ఎస్సై రమాదేవి