| Daily భారత్
Logo




వైకుంఠ రథాన్ని పంపని సిరిసిల్ల మున్సిపల్ అధికారులు

News

Posted on 2024-01-07 14:15:57

Share: Share


వైకుంఠ రథాన్ని పంపని సిరిసిల్ల మున్సిపల్ అధికారులు

డీజిల్ లేదని డ్రైవర్ నిర్లక్ష్య సమాధానం

డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ప్రజలు ఆఖరు ఘట్టానికి అవస్థలు పడుతున్నారు. దానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పనితీరు మరింత తోడవుతుంది. వార్డుకు చెందిన  ఒక వ్యక్తి గుండె నొప్పితో మరణించాడు. అయితే వార్డులో స్మశాన వాటిక లేదు. మృత దేహాన్ని మూడు కిలో మీటర్లకు పైగా వెళ్లి ఖననం చేయాలి. ఒంటి గంటకు స్థానికులు వైకుంఠ రథాన్ని పంపాలని సంబధిత మున్సిపల్ అధికారులకు తెలిపారు. సంబంధిత అధికారి డ్రైవర్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు గంటల వరకు వేచి చూసిన స్థానికులు డ్రైవర్ కు ఫోన్ చేయగా డీజిల్ లేదని నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక మృత దేహాన్ని మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి అంత్యక్రియలు చేశారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై వార్డు ప్రజలు మండిపడుతున్నారు. ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి స్మశాన వాటిక నిర్మించాలని ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే స్మశాన వాటిక మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ కోరారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >