| Daily భారత్
Logo




అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

News

Posted on 2024-01-07 03:31:19

Share: Share


అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

డైలీ భారత్, పార్వతీపురం జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగి అరవింద్ మృతి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారిం ది. అరవింద్ సొంత గ్రామం పాలకొండ మండలం గోపాలపురం. అరవింద్ కు తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు అరవింద్ ను ఎంతో కష్టపడి చదివించారు.

చిన్నతనం నుండి ఏది అడిగినా కాదు అనకుండా అడిగినవన్నీ ఇచ్చారు. చదువు పూర్తవ్వగాన ఓ మంచి కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగం చేసుకుంటు న్నాడు.

ఇంటి వద్ద ఉండటంతో అందరితో సరదాగా గడుపుతూ, తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటూ వారికి కావాల్సిన అవ సరాలు తీరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేశాడు. మొదట కొద్ది పాటిగా చేసిన అప్పు తరువాత రోజుల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ చివరికి అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది.

అయితే ఇచ్చిన డబ్బులు కోసం స్నేహితులు, బంధు వులు కూడా ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో మన స్థాపానికి గురై తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అరవింద్ కొద్ది సేపు బయటకెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకి వెళ్లాడు.

అలా వెళ్ళిన అరవింద్ ఎంతకీ తిరిగి రాకపోవ డంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై సమీప ప్రాంతాల్లో వెదకటం ప్రారం భించారు. ఈ క్రమం లోనే వారికి పోలీసు లు నుండి అరవింద్ మృతి చెందాడన్న పిడుగు లాంటి వార్త వచ్చింది.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అరవింద్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి అరవింధ్ ఆత్మహత్య చేసుకున్నాడనే నిర్ధారణకు వచ్చారు.

అయితే అరవింద్ ఆత్మ హత్య చేసుకున్నాడనే అంశం పై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చేశాడు.

రాత్రి బయటికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. పలు అనుమానాలకు తావి స్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు....

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >