| Daily భారత్
Logo




నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్

News

Posted on 2024-01-06 09:35:11

Share: Share


నారాయణ మహిళ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్

డైలీ భారత్, హైదరాబాద్ :మల్లంపేట లోని నారాయణ మహిళా జూనియర్ కళా శాల తరుచూ వివాదాలకు కారణం అవుతోంది.

గతంలో కళాశాలలో చదు వుతున్న విద్యార్థులను మరోచోటికి పంపించడంతో తల్లి దండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

తాజాగా కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో హుటా హుటిన విద్యార్థు లను స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తర లించినట్లు సమాచారం. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత ఆహారం, తాగు నీరు కలుషితం కావడమే కారణంగా తెలుస్తుంది.

కళాశాల వంటగదిని పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమా చారం. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను యాజమాన్యం తరలిస్తు న్నట్లు తెలుస్తోంది.

1500 మంది విద్యార్థులు ఉన్న మల్లంపేట నారాయణ మహిళా జూనియర్ కళాశా లలో కలుషిత ఆహారం, తాగు నీటి సమస్య వల్ల 200 మందికి పైగా విద్యా ర్థులు అస్వస్థతకు గురికా వడంతో సంక్రాంతి సెలవులు పేరుతో గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులను ఇళ్లకు తరలించారు.

ఓ వైపు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నా సంక్రాంతి 10 రోజుల ముందే విద్యా ర్థులకు సెలవుల పేరుతో తరలిస్తుండడంతో తల్లి దండ్రులు ఆందోళన చెందు తున్నారు. కళాశాల ఏజీఎం ప్రసాద్‌ను వివరణ కోరగా వాతావరణ సమస్య వలన కొందరు విద్యార్థులు అస్వ స్థతకు గురైంది వాస్తవమే అన్నారు.

విద్యార్థులు ఆందోళన చెందకుండా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తా మన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >