| Daily భారత్
Logo




మానవత్వం లేని సమాజంలో బతుకుతున్నామా...?

News

Posted on 2025-10-18 15:33:42

Share: Share


మానవత్వం లేని సమాజంలో బతుకుతున్నామా...?

విధినిర్వహణలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరార్ అవుతున్న వీడియోలు ఫోటోలు తీస్తూ కనీసం కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడాలని ధ్యాస లేని సిగ్గులేని సమాజం

కానిస్టేబుల్ హత్య ఉదంతంతో ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మారదు లోకం.. మారదు సమాజం.. ఈ సిగ్గులేని సమాజం అని ఒక సినీ గేయ రచయిత ఓ సినిమాలో పాడిన పాటకు అక్షరాల నిజం చేసి చూపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఒక క్రిమినల్ పాత నేరస్తుడుని పట్టుకొని స్టేషన్లో అప్పజెప్పడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో సిసిఎస్ కానిస్టేబుల్ అయిన ప్రమోద్ ను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసి నిర్భయంగా పరారవుతున్న అక్కడే ఉన్న స్థానికులు ఫోటోలు వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారే తప్ప ఒక మనిషి చావు బతుకులో ఉన్నారు వారిని కాపాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేని వారు ఒక్క క్షణం ఆలోచించి వారు మొబైల్ లో తీస్తున్న వీడియోలు ఫోటోలను ఆపి కానిస్టేబుల్ పై దాడి చేసి హత్యకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోకుండా సినిమా చూసినట్లు చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా విధుల్లో ఉన్నావు కానిస్టేబుల్ దీపావళి పండగ ముందు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అందుకే నిజామాబాద్ సిపి సాయి చైతన్య శనివారం ఉదయం జిల్లా ప్రజల్లో మానవత్వం ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు అందులో ఏమాత్రం తప్పులేదు. ఒకవేళ అదే ప్రాంతంలో ఎవరో ఒక రౌడీ ఒక ఇంటిపై డాడీ చేసి ఇంట్లో ఉన్న వారిని గాయాలపాలు చేసి హత్య చేస్తే ఇలానే నిర్లక్ష్యంగా ఊరుకుంటారా అని మనలో మనమే ఒకసారి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఏముంది ఆ కుటుంబానికి పండగ ముందు ఆ కిరాతక నరహంతకుడు చేసిన గాయం జీవితాంతం మర్చిపోలేని పరిస్థితి. ఇప్పటికైనా సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలి, మనము మంచి ఉంటే సరిపోతుంది ఎదుటివారు ఏమవుతే మనకి ఏమైతుంది అనే ఆలోచించే వారికి రేపటి నాడు తమ కుటుంబం పైనే ఎవరో ఒకరు దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటారా వారిని రక్షించాల్సింది పోలీసులు కాదా.. అనే కనీస ఇంగిత జ్ఞానం తెలియకుండా ప్రవర్తించారు. కానిస్టేబుల్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్నవారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >