Posted on 2025-10-18 04:45:11
పాత కేసుల్లో పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకొని వస్తుండగా ఘటన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్ ప్రాంతానికి చెందిన రియాజ్ అనే పాత నిందితుడిని సిసిఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్ ఇద్దరు కలిసి శుక్రవారం కిల్లా రోడ్డులో పట్టుకొని యాక్టివా ద్విచక్ర వాహనం పై సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక నగర్ ప్రాంతానికి రాగానే, నిందితుడు రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా పొడిచాడు. కత్తిపూట్లతో తీవ్ర రక్తస్రావమైన సదరు కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ ను దారుణం గా కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు రియాజ్ అక్కడి నుండి పరారయ్యాడు. నిండుతుడి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు ఆచూకీ తెలిసినవారు వెంటనే డయల్ 100 కు లేదా దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వగలరు పోలీసు అధికారులు వెల్లడించారు.
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >