| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి..

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి..

డైలీ భారత్, ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 841 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో(ఆదివారం ఉదయం 8 వరకు) వైరస్ బారిన పడి మొత్తం ముగ్గురు మరణించారు. వీరిలో కేరళ, కర్ణాటక, బిహార్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు చెప్పారు. 2023 డిసెంబరు 5 వరకు దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేదని, అయితే కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతుండడం, పైగా శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం ఈ కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు వెల్లడించారు.

Previous లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Next ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి
ADVERTISEMENT