Posted on 2025-09-26 16:59:24
అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి
పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలి
ఎల్లారెడ్డిపేట కళాశాలలో పీటీఎంకు హాజరైన కలెక్టర్
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదో తరగతి ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ దశ కీలకమని స్పష్టం చేశారు. ఇంటర్ నుంచే ప్రతి సబ్జెక్టు పరిధి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ తాము ఎంచుకున్న గ్రూప్ లకు సంబంధించి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాల లోని లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం డాక్టర్, ఇంజనీర్ కాకుండా లాయర్, ఆర్కిటెక్, టీచర్, బిజినెస్ మ్యాన్ ఇతర రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రతి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రద్ధగా చదువుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంట్లో చదివించాలని తెలిపారు. తల్లిదండ్రుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో జూనియర్ కళాశాలలు మరింత బలపడి పూర్వవైభవం వస్తుందని తెలిపారు.
కళాశాలలో గదులు ఇతర సమస్యలను తాను పరిష్కరి స్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రతిరోజు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలను విద్యార్థులు శ్రద్ధగా విని రాసుకొని వాటిని నిరంతరం సాధన చేయాలని తెలిపారు. అధ్యాపకులు అందరూ ఎప్పటికప్పుడు ముగుస్తున్న పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించాలని ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కలెక్టర్ సూచించగా, కళాశాలలో శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ , విద్యార్థులకు ఆర్టీసీ బస్ స్టాప్ సౌకర్యం, తదితర సమస్యలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తరగతి గదుల్లో అవసరమైన డెస్క్ లను వెంటనే సమకూరుస్తామని, ఆన్ అకాడమీ కోసం అవసరమైన డిజిటల్ బోర్డులు త్వరలోనే వస్తాయని, శిథిలావస్థలో ఉన్న కొన్ని తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని, త్వరలోనే నిర్మాణం చేపడుతామని కలెక్టర్ తెలిపారు.
కళాశాలలో మైదానం, ఆవరణను కలెక్టర్ పరిశీలించారు. గడ్డి, పిచ్చిమొక్కలు శుభ్రం చేయించాలని ఎంపీడీఓ సత్తయ్యను ఆదేశించారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసిల్దార్ సుజాత, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >