| Daily భారత్
Logo




స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

News

Posted on 2025-09-25 19:01:31

Share: Share


స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆయా కార్యక్రమాల  సిబ్బంది తో కలిసి బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్  ముఖ దేవేంద్ర గుప్తా హాజరై ప్రసంగించారు అనే సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని ఇది దైవ భక్తితో కూడుకున్నదే కాదని బతుకమ్మ ఆడటం మహిళలకు ఎంతో ఆరోగ్యకరమని కాబట్టి మన పూర్వీకులు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకతను ఇచ్చారని చెప్పారు. స్నేహ సొసైటీ తో నా అనుబంధం 30 గురువారం ఐదవ రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా ఏళ్ల నాటిదని ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువారం ఐదవ రోజు అట్ల బతుకమ్మ సందర్భంగా స్నేహ సొసైటీ కి వచ్చి స్నేహ సొసైటీ లోని దివ్యాంగ బాలలు, సిబ్బందితో కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.  మహిళా మణులు ఎంతో సంతోషంగా సహజసిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగ ను ఘనంగా జరుపుకున్నారు.. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు..దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ  కార్యదర్శి యసుద్దయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది తెలంగాణ ప్రత్యేక పండగానే తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు,  మరియు జిల్లా పాలనయాత్రాంగానికి ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు..స్నేహ సొసైటీలో స్నేహితులందరితో సంతోషంగా బతుకమ్మను అందరం కలిసి రంగు రంగుల పూలతో పేర్చి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందని అన్నారు... స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది మరియు అందుల పాఠశాలలోని సిబ్బంది మరియు టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న మహిళ సిబ్బందితో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు..


ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ సభ్యులు టీ. వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ టార్గెటేడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు మేనేజర్ బాలరాజు స్నేహ సొసైటీ  వివిధ కార్యక్రమాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >