Posted on 2025-09-24 06:35:28
ఇరుగు పొరుగు వారి వేధింపుల వల్లే పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం
విచారణ కోసం రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో గల డీమార్ట్ వెనకాల ఉన్న ఓ అపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతుంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇరుగుపొరుగువారు, అపార్ట్మెంట్ వాసులు ఒకరిపై ఒకరు అబండాలు వేసుకుంటూ కొందరు ఓ గ్రూపుగా మారి తమకు అపార్ట్మెంట్లో నచ్చని వారిని టార్గెట్ చేసి వారిని వేధింపులకు గురి చేయడం వారి ధ్యేయంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది. మూడు పదుల వయసున్న వివాహిత ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డ గాని బాధితురాలికి న్యాయం జరగలేదని ఆమె తరపు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్ లోని డీ మార్ట్ వెనకాల గల శతమానం అపార్ట్మెంట్ లో మూడు పదుల వయసున్న వివాహిత పది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పది రోజులు గడవక ముందే మళ్లీ అదే అపార్ట్మెంట్ కు చెందిన మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి ప
పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సదరు వివాహిత వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇస్టారీతిన వ్యాఖ్యలతో విసిగి వేసరి పోయి ఆత్మహత్య యత్నం చేసినట్టు బాధితురాలు కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు... తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >