Posted on 2023-12-25 15:38:39
డైలీ భారత్, తెలంగాణ: పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లోని నాలుగు
నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని, ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆరెస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్చార్జులుగా.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.
సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని.. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >