బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..
14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
డైలీ భారత్, హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలం కొల్గూరులో అదుపులోకి జూబ్లీహిల్స్ పోలీసులు తీసుకున్నారు. ప్రశాంత్‌తోపాటు అతడి సొదరుడు రాజును సైతం పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో విచారించారు. ఈనెల 17న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం విజేత ప్రశాంత్‌కు స్వాగతం పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియో వద్దకు చేరుకుని నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి ఈ దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ ఆర్టీసి ఎండీ వీసి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.